పాన్ ఇండియా మూవీతో రాబోతున్న సుధీర్ బాబు


న‌వ ద‌ళ‌ప‌తి సుధీర్ బాబు ఇటీవ‌ల ‘హ‌రోం హ‌ర’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన ‘హ‌రోం హ‌ర’ మూవీలో సుధీర్ బాబు ప‌ర్ఫార్మెన్స్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌పై ఫోక‌స్ పెట్టాడు ఈ హీరో. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ఓ పాన్ ఇండియా మూవీతో మ‌న‌ముందుకు వ‌చ్చేందుకు సుధీర్ బాబు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌.

బాలీవుడ్ లో రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్ వంటి బ్లాక్ బస్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్రేర‌ణ అరోరా, శివిన్ నార‌గ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ నిర్మాత‌లుగా ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ రూపొంద‌నుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు న‌టించ‌నున్నాడు. ఇక ఈ సినిమాను వెంక‌ట్ క‌ళ్యాణ్‌ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించ‌బోతున్నారు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌బోతున్నఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యాన‌త ఉంటుంద‌ట‌. ఇక ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అధికారికంగా తెలియజేస్తార‌ట‌.

Exit mobile version