‘శ్రీదేవి సోడా సెంటర్’.. మాస్ ట్రీట్మెంట్ ఖాయమా ?

Published on Oct 30, 2020 10:15 pm IST


ఇటీవలే ‘వి’ సినిమాతో పలకరించాడు హీరో సుధీర్ బాబు. అందులో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం సుధీర్ బాబు ఒక కొత్త చిత్రాన్ని చేస్తున్నారు. ‘పలాస’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. కొద్దిసేపటి క్రితమే మోషన్ పోస్టర్ విడుదలైంది. సినిమాకు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే టైటిల్ నిర్ణయించారు. టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

మోషన్ పోస్టర్ చూస్తే కరుణ కుమార్ గత చిత్రం ‘పలాస’ తరహాలోనే ఇది కూడ రూరల్ బ్యాక్ డ్రాప్లో నడిచే మాస్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. ప్రత్యేకించి సినిమా టైటిల్ చూస్తే కథ మీద కూడ ఆసక్తి కలుగుతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనుండటం మరొక పెద్ద విశేషం. మోషన్ పోస్టర్లోనే ఆయన మాస్ ట్రీట్మెంట్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని గతంలో సుధీర్ బాబుతో ‘భలే మంచి రోజు’ చిత్రాన్ని నిర్మించిన 70 ఎమ్ ఎమ్ బ్యానర్ నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More