గొర్రె పురాణం ట్రైలర్.. మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..!

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘గొర్రె పురాణం’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే, ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా, ఈ ఆసక్తికి క్లారిటీ ఇచ్చేలా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

ఓ గొర్రె చుట్టూ ఈ సినిమా కథ సాగుతుండగా.. రెండు మతాల మధ్య ఈ గొర్రె ఎలాంటి వివాదాలను రేపింది.. అసలు ఈ గొర్రె కథ ఏమిటి.. మధ్యలో సుహాస్ పాత్ర ఏమిటనేది ఈ సినిమా కథగా సాగనుంది. ఈ ట్రైలర్ కట్ ఆద్యంతం సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉండటంతో ఈ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక సుహాస్ ఎప్పటిలాగే ఈసారి మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తుండగా విషిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ సిహెచ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 20న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version