మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ జెనరేషన్ లో మంచి టాలెంట్ తో ఆదరణ అందుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ నటుడు సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా “రైటర్ పద్మభూషణ్”. పెద్దగా హడావుడి లేకుండానే అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం ప్రమోషన్స్ తో ఊపందుకొని మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది.
అయితే ఈ సినిమాకి మంచి పాజిటివ్ మౌత్ టాక్ సొంతం కావడం ఆడియెన్స్ ని మెప్పించే విధంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండడంతో ఈ వారంలో వచ్చిన ఈ సినిమా అప్పుడే థియేటర్స్ లో గ్రోత్ చూస్తుంది. ఆల్రెడీ అనేక చోట్ల అదనపు షోలు ఈ సినిమాకి పడుతూ ఉండగా యూఎస్ లో కూడా ఈ చిత్రం డీసెంట్ నంబర్స్ నమోదు చేస్తుండడం విశేషం.
ఇక ఈ చిత్రానికి షణ్ముఖ్ చంద్ర దర్శకత్వం వహించగా ఆశిష్ విద్యార్థి మరియు రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే శేఖర్ చంద్ర మరియు కళ్యాణ్ నాయక్ లు సంగీతం అందించారు. లహరి ఫిల్మ్స్ మరియు ఛాయ్ బిస్కెట్ వారు నిర్మాణం వహించారు.