సుహాస్ కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఫిక్స్

సుహాస్ కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఫిక్స్

Published on Jul 1, 2024 12:44 PM IST

సుహాస్ హీరోగా వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్నాడు. ఇక ఈ యాక్ట‌ర్ ప్ర‌స్తుతం దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల‌ అనే ద‌ర్శ‌కుడు డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ పై మేక‌ర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా టైటిల్ ను జూలై 2న అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా వెల్ల‌డించారు. ఈ సినిమాలో సుహాస్ స‌ర‌స‌న సంగీర్త‌న విపిన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాకు విజ‌య్ బుల్గ‌నిన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డిలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ తెర‌కెక్కించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి ఈ సినిమాకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెడ‌తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు