సుహాస్ కొత్త మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు రామ్ గోధల పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మార్చి 24న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమా టీజర్ ఎలాంటి కంటెంట్‌తో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో సుహాస్ మరోసారి హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా రధాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హర్ష నల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version