‘ఓ భామ అయ్యో రామ’ మూవీ డబ్బింగ్ వర్క్ స్టార్ట్

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ భామ అయ్యో రామ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ గోధల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో డబ్బింగ్ వర్క్ ఫోటోలు పోస్ట్ చేశారు. సుహాస్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెబుతూ ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా ‘నువ్వు నేను’ ఫేం అనితా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలీ, రవీందర్ విజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రధాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version