ప్రభాస్ కొత్త సినిమా రిలీజయ్యేలోపు అవి వచ్చేస్తాయట

Published on Nov 21, 2020 2:12 am IST


హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తెలుగులో సూపర్ హిట్టైన ‘ఛత్రపతి’ చిత్రాన్నే హిందీలోకి రీమేక్ చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ రీమేక్ చిత్రానికి ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్ చేయనున్నట్లు పుకార్లు లేచాయి. సుజీత్ కు ‘సాహో’తో బాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి ఆయన్ను తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఆ వార్తల్లో నిజం లేదట. ఈ సంగతిని ఎవరో కాదు నేరుగా సుజీత్ చెప్పడం విశేషం. తాను ఏ రీమేక్ సినిమాను చేయట్లేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారాయన. దీంతో ‘ఛత్రపతి’ రీమేక్ మీద స్పష్టత వచ్చేసినట్లైంది. అలాగే ‘సాహో’లోని డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేస్తామని గతంలో సుజీత్ చెప్పిన విషయాన్ని అభిమానులు గుర్తుచేయగా ప్రభాస్ అన్న నెక్స్ట్ సినిమా వచ్చే లోపు చేస్తాలే అంటూ సమాధానం ఇచ్చారు సుజీత్. ఇకపోతే ‘సాహో’ తర్వాత సుజీత్ ఇప్పటి వరకు మరొక కొత్త సినిమాకు కమిటవ్వలేదు. ఆ మధ్య చిరు ‘లూసిఫెర్’ రీమేక్ చేస్తారని వార్తలొచ్చినా ఆయన చేయట్లేదని తర్వాత తేలింది.

సంబంధిత సమాచారం :

More