“కల్కి” చిత్రాన్ని చూశాక సుకుమార్ రియాక్షన్ ఇదే!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. ఈ చిత్రం నిన్న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ను చూసిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ చూడటం జరిగింది. అన్ బిలీవబుల్ అంటూ చెప్పుకొచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకునే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version