గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే మేకర్స్ యూఎస్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టారు. అయితే ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా దర్శకుడు సుకుమార్ హాజరైన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఈవెంట్ లో సుకుమార్ ఇచ్చిన ఓ సమాధానం అందరికీ ఇపుడు షాకిచ్చింది అని చెప్పాలి. దోప్ అనే పదంతో ఒకటి వదిలెయ్యాలి అంటే ఏం వదిలేస్తారు అనే ప్రశ్నకి సుకుమార్ సినిమా వదిలేస్తాను అని షాకింగ్ సమాధానం అందించారు. దీనితో స్టేట్మెంట్ ఇపుడు ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. సుకుమార్ సినిమాలు వదిలెయ్యడం ఏంటి అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి సుకుమార్ ఏమనుకొని అన్నారో కానీ ఈ స్టేట్మెంట్ ఇపుడు వైరల్ అయ్యింది.