సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సుకుమార్ కూతురు

క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు దర్శకుడు సుకుమార్. తనదైన మార్క్ మూవీ మేకింగ్‌తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది.

ఇక ఇప్పుడు సుకుమార్ కూతురు సుక్రితి వేణి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమె ‘గాంధీ తాత చెట్టు’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాను పద్మావతి మల్లాడి అనే లేడీ డైరెక్ట్ తెరకెక్కిస్తుండటం విశేషం. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు.

‘గాంధీ తాత చెట్టు’ చిత్రాన్ని జనవరి 24, 2025 తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version