ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా హిట్ చిత్రం పుష్ప 2 ది రూల్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంకి కొనసాగింపుగా పుష్ప 3 ది ర్యాంపేజ్ కూడా ఉన్న విషయం అందరికీ తెలుసు. అయితే పార్ట్ 3 కి లీడ్ గా పుష్ప 2 క్లైమాక్స్ లో ఒక కొత్త విలన్ ని మేకర్స్ పరిచయం చేయడంతో అది ఎవరు అనే సస్పెన్స్ మిగిలింది.
అయితే అదెవరు అనే ప్రశ్నకి సుకుమార్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. ఒక తమిళ ఈవెంట్లో పాల్గొన్న సుకుమార్ ఆ పాత్ర విజయ్ దేవరకొండ, నాని అంటూ చాలా మంది అంటున్నారు అనే మాటకి దానికి సమాధానం 2024 టైం సుకుమార్ తెలియదు కానీ 2026కి అలా స్క్రిప్ట్ రాసుకునే సుకుమార్ కి తెలుస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. అంటే ఆ పాత్రలో కనిపించేది ఎవరు అనేది ఇప్పటికీ ఎవరినీ ఫిక్స్ చేయలేదని చెప్పాలి. మరి అదెవరో అనేది వేచి చూడాలి.