‘పుష్ప-2’లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్..?

‘పుష్ప-2’లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్..?

Published on Oct 30, 2024 5:31 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప-2’ వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులను స్టన్ చేసే అంశాలతో పాటు సర్‌ప్రైజ్ చేసే అంశాలు కూడా చాలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘పుష్ప-3’కి అదిరిపోయే లీడ్ ఇవ్వనున్నట్లుగా మేకర్స్ ఇటీవల తెలిపారు. దీంతో పుష్ప-2 క్లైమాక్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ క్లైమాక్స్‌ను మరింత సర్‌ప్రైజింగ్‌గా మలిచాడట సుకుమార్. పుష్ప-2 చిత్ర క్లైమాక్స్‌లో ఓ స్టార్ హీరో వాయిస్ మనకు వినిపిస్తుందని.. ఆ వాయిస్‌తో పుష్ప-2 ముగుస్తుందని సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో సుకుమార్ పుష్ప-2 క్లైమాక్స్‌ను గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పుష్ప-2 క్లైమాక్స్‌లో ఏ స్టార్ హీరో వాయిస్ వినిపిస్తుందా.. ఆ హీరో సినిమాలో కూడా కనిపిస్తాడా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు