సుకుమార్ చేతుల మీదుగా “రాజమండ్రి రోజ్‌మిల్క్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

Published on May 28, 2022 11:07 pm IST


ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఇంట్రూప్ ఫిలింస్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్న తాజా చిత్రం ‘రాజమండ్రి రోజ్ మిల్క్’. ఈ సినిమాలో నాని బండ్రెడ్డి అనే కొత్త వ్యక్తి మెగాఫోన్ పట్టాడు. జై మరియు అనంతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ మరియు ప్రవీణ్‌లు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ అయ్యింది. చీజీ చైతు మరియు క్రేజీ కీర్తి అంటూ జై మరియు అవంతిక పాత్రల పేర్లను కూడా రివీల్ చేశారు. ఇందులో సైకిల్ మీద అవంతిక వెళ్తుండగా వెనకనే జై ఆమెను సైకిల్‌పై ఫాలో అవుతూ కనిపిస్తాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఈ సినిమా క్యూట్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :