క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక యావత్ సినీ లవర్స్ ‘పుష్ప-2’ మేనియాతో ఊగిపోతున్నారు. దర్శకుడు సుకుమార్ క్రియేటివ్ టేకింగ్‌కు వారు సెల్యూ్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అభిమానులు సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ తన నక్స్ట్ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. RC17 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అయితే, సుకుమార్ ఈసారి తన మాస్ టచ్‌ని వదిలి రామ్ చరణ్ కోసం క్లాస్ కథను పట్టుకు రాబోతున్నాడని తెలుస్తోంది. గతంలో చరణ్‌తో ‘రంగస్థలం’ అనే పక్కా రూరల్ రివెంజ్ డ్రామా మూవీని తెరకెక్కించాడు. ఆ తర్వాత పుష్ప, పుష్ప-2 చిత్రాలను కూడా మాస్ పంథాలో తెరకెక్కించాడు సుకుమార్.
అయితే, ఇప్పుడు చరణ్ కోసం పక్కా స్టైలిష్ అండ్ క్లాస్ టచ్ ఉన్న కథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో చరణ్ లుక్స్ ఎవరూ ఊహించని విధంగా అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి చరణ్ కోసం సుకుమార్ క్లాస్ కథను రెడీ చేస్తున్నాడనే టాక్ జోరుగా ప్రచారం అవుతోంది.