చరణ్ కోసం మళ్లీ అలాంటి కథే రాస్తున్నాడట

రామ్ చరణ్ కెరీర్లో అన్నీ విధాలా పూర్తిస్థాయిలో విజయాన్ని అందుకున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఇకపై కూడా చరణ్ ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలని అభిమానులు కోరుకున్నారు. సుకుమార్ సైతం చరణ్ కోసం మళ్లీ ఇలాంటి కథే రాస్తున్నట్టు భోగట్టా.

‘రంగస్థలం’ మాస్ ప్రేక్షకుల్ని ఎలాగైతే ఉర్రూతలూగించిందో అలాంటి కథే ఈసారి కూడా తయారుచేస్తున్నారట సుకుమార్. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సినిమాను చేస్తున్న ఆయన భవిష్యత్తులో చెర్రీతో మరోసారి వర్క్ చేయాలని అనుకుంటున్నారట. అందుకోసమే ఈ కథను రాసుకుంటున్నారని, అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం వీరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట.

Exit mobile version