తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమన్ సంచల వ్యాఖ్యలు చేశారు. సుమన్ మాట్లాడుతూ.. ‘తిరుమల లడ్డూ చాలా ముఖ్యం. తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం దారుణమైన చర్య. ముస్లిం అయినా, క్రైస్తవులు, ఇతర ఏ మతం అయినా వారికి పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ జరగడం మంచిది కాదు. అసలు తిరుమలకు కల్తీ నెయ్యి ఎలా వచ్చింది ? అని సుమన్ ప్రశ్నించారు.
సుమన్ ఇంకా మాట్లాడుతూ.. ‘టీటీడీలో బోర్డు మెంబర్లు, అధికారులు దీనిపై ఏం చేస్తున్నారు ?, కొందరు నెయ్యి కల్తీ జరిగిందని, దాన్ని ప్రసాదాల తయారీలో వినియోగించారని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు ఏం చేస్తున్నారు ?, భక్తి, దేవుడి ప్రసాదంలో ఇలాంటివి జరగకూడదు. అన్ని మతాలలో ఇలాంటివి తప్పు జరగకుండా పార్లమెంటులో బిల్లు పెట్టాలని సుమన్ సూచించారు. అలాగే, కల్తీ వ్యవహారంలో జాగ్రత్తగా నిజానిజాలు తేల్చి.. దోషులను ఉగ్రవాదులు లాగా శిక్షించాలని సుమన్ చెప్పుకొచ్చారు.