ఓటిటిలో అదరగొడుతున్న సుమంత్ “అహం రీబూట్”

ఓటిటిలో అదరగొడుతున్న సుమంత్ “అహం రీబూట్”

Published on Jul 19, 2024 11:00 AM IST

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో వచ్చిన పలు ఒరిజినల్ కంటెంట్ లో లేటెస్ట్ చిత్రం టాలెంటెడ్ నటుడు సుమంత్ నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “అహం రీబూట్” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం థ్రిల్లర్ ఆడియెన్స్ లో బాగానే టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో అదరగొడుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ జూలై 1 న ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఓటిటిలో ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది అని చెప్పాలి. సినిమా మొత్తం ఒక్క హీరో మీదనే కనిపించే థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాని థ్రిల్లర్ లవర్స్ లో టాక్ రావడంతో కొందరు చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇలా ఈ చిత్రంకి ఇప్పుడు ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందించగా రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు