“వాల్తేర్ శీను”గా మారిన సుమంత్.. లుక్ అదిరిందిగా..!

“వాల్తేర్ శీను”గా మారిన సుమంత్.. లుక్ అదిరిందిగా..!

Published on Feb 9, 2022 5:23 PM IST

అక్కినేని మేనల్లుడు సుమంత్ గతేడాది ‘కపటధారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’, ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. రాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పౌ మను యజ్ఞ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రానికి తాజాగా ‘వాల్తేర్ శీను’గా టైటిల్ మార్చారు. మలయాళ సూపర్ హిట్ ‘పడయోట్టం’ చిత్రానికి ఇది రీమేక్.

అయితే సుమంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను మార్చుతూ ‘వాల్తేరు శీను’ పేరుతో స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సుమంత్ మాస్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా, నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మధు నందన్‌, హైపర్‌ ఆది, మిర్చి కిరణ్‌, కళ్యాణ్‌, ధనరాజ్‌, రఘు కారుమంచి, సిజ్జు, ప్రభ (సీనియర్‌ నటి) తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు