వేసవి వచ్చిందంటే సూర్యుడు తన ప్రతాపం చూపెట్టడం మొదలుపెడతాడు. అయితే, వేసవి తాపాన్ని కూడా లెక్కచేయకుండా క్రికెట్ అభిమానులు తమ అభిమాన IPL టోర్నీని వీక్షించడం మనం చూస్తుంటాం. ప్రతి ఏటా వేసవిలో వచ్చే ఐపీఎల్ టోర్నమెంట్ ఈసారి కూడా క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యింది. అయితే, ఈ క్రికెట్ ఫీవర్‌తో బాక్సాఫీస్‌పై ప్రభావం పడటం సహజం.
సాధారణంగానే వేసవిలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తక్కువ. ఏదైనా సినిమా బ్లాక్‌బస్టర్ మౌత్ టాక్ తెచ్చుకోవడం.. పాజిటివ్ రివ్యూలు రావడం జరిగితే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఈసారి కూడా ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ కారణంగా టాలీవుడ్ బాక్సాఫీస్‌పై ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పలు సినిమాలు సమ్మర్‌లో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ, ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం అవుతుండటంతో దీని ఎఫెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
ఏదేమైనా బాక్సాఫీస్ వర్సెస్ క్రికెట్ ఫీవర్‌తో ఈ సమ్మర్ వార్ మరింత రసవత్తరంగా మారనుంది. మరి కామన్ పబ్లిక్ ఈసారి దేనికి ఓటు వేస్తారో చూడాలి.