విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: హర్ష చెముడు, హర్ష వర్ధన్, దివ్య శ్రీపాద, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం తదితరులు
దర్శకుడు: కళ్యాణ్ సంతోష్
నిర్మాతలు: రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రాఫర్: దీపక్ యెరగేరా
ఎడిటింగ్: కార్తీక్ వున్నవా
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన తన మొదటి సినిమా “సుందరం మాస్టర్” కూడా ఒకటి. మరి మాస్ మహారాజ్ రవితేజ నిర్మాణంలో డీసెంట్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
మిర్యాలమెట్ట అనే ఓ చిన్న కుగ్రామంకి ఇంగ్లీష్ సబ్జెక్టు చెప్పేందుకు సుందర్ రావు(హర్ష చెముడు) ఓ సీక్రెట్ మిషన్ తో వెళ్తాడు. మరి ఆ గ్రామంలో ప్రజలతో తాను ఎలా సెట్ అయ్యాడు? తాను వెళ్లిన మిషన్ ఏంటి? దాన్ని అతను సాధించాడా లేదా చివరికి ఏమయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
యువ నటుడు హర్ష ఎలాంటి నటుడు అనేది తెలుసు. అయితే ఓ ఫుల్ లెంగ్త్ రోల్ లో తాను ఈ చిత్రంలో కనిపించాడు. మరి తాను ఈ మొదటి సినిమాలో మరింత పరిణితి తన నటనలో కనబరిచాడు అనిక్ చెప్పాలి. అలాగే తనపై కనిపించే పలు కామెడీ సీన్స్ అయితే మంచి హిలేరియస్ గా కూడా కనిపిస్తాయి. వాటిలో తన ఈజ్ నటన కానీ టైమింగ్ కానీ ఇంప్రెస్ చేస్తాయి.
అలాగే గ్రామస్తులతో కనిపించే కొన్ని కామెడీ సీన్స్ వారి అమాయకత్వం, ఎమోషన్స్ తో చాలా నీట్ గా కనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇక వీటితో పాటుగా బాలకృష్ణ నీలకంఠపు తదితర ముఖ్య తారాగణం తమ పాత్ర పరిధి మేరకు సహజమైన పెర్ఫామెన్స్ ని అందించే ప్రయత్నం చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో కథ చాలా సింపుల్ గానే ఉంటుంది కానీ ఈ కథని ఇంకా ఆసక్తిగా మలిచే ప్రయత్నం ఈ సినిమాలో మిస్ అయ్యింది మెయిన్ గా సెకండాఫ్ లో మరింత ఆసక్తి రేకెత్తించి ఉంటే బాగుండేది. అలాగే చాలా ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో మరింత కామెడీ అండ్ ఎమోషన్స్ తో కూడిన బ్యూటిఫుల్ ట్రీట్ ని కూడా ఆశించి ఉంటారు. కానీ ఈ సినిమా పట్ల వారికి నిరాశ తప్పదు.
అలాగే ఫస్టాఫ్ లో కనిపించిన కామెడీ నరేషన్ సెకండాఫ్ లో డల్ అయ్యిపోతుంది. దీనితో బ్యాలన్స్ మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది. అలాగే దివ్య శ్రీపాద, హర్ష వర్ధన్ లాంటి నటులు ఉన్నప్పటికీ కూడా వారిపై సన్నివేశాలు కొన్ని అంత ఎఫెక్టీవ్ గా ఉండవు. అలాగే స్లో నరేషన్ కాస్త సహనాన్ని పరీక్షిస్తుంది.
ఇక ఫైనల్ గా క్లైమాక్స్ పోర్షన్ కోసం మాట్లాడినట్టయితే హర్ష చెముడు మరియు హర్ష వర్ధన్ ల నడుమ కనిపించే సీక్వెన్స్ అంత కన్విన్స్డ్ గా అనిపించదు. దీనితో ఇదీ ఒకింత నిరాశ కలిగిస్తుంది.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. విలేజ్ సెటప్ అంతా నాచురల్ గా కనిపిస్తుంది. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అంతా నాచురల్ గా కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్ పర్వాలేదు.
ఇక దర్శకుడు కళ్యాణ్ సంతోష్ విషయానికి వస్తే.. తాను సింపుల్ లైన్ నే ఎంచుకున్నప్పటికీ దానిని ఇంకా ఎంగేజింగ్ గా మలిచే ప్రయత్నం చేసి ఉండాల్సింది. మెయిన్ గా ఫస్టాఫ్ లో కొనసాగించిన హిలేరియస్ నరేషన్ సెకండాఫ్ లో కూడా మైంటైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సుందరం మాస్టర్” క్లాసెస్ ఒకింత కామెడీగా ఉన్నప్పటికీ ఫుల్ గా ఎంజాయ్ చేసే రేంజ్ లో అయితే లేవని చెప్పాలి. స్లో గా సాగే నరేషన్ కొంచెం బోరింగ్ స్క్రీన్ ప్లే వంటివి ఫలితాన్ని డీవియేట్ చేసాయి. అలాగే మంచి ఎమోషన్స్ కూడా మిస్ అయ్యాయి. వీటితో అయితే ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team