తమిళ స్టార్ హీరో ధనుష్ తన కెరీర్ లోని 50వ చిత్రంగా నటిస్తున్న రాయన్ ఇప్పటికే సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జూలై 26న రిలీజ్ అవుతున్న రాయన్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించారు.
మీరు గతంలోనూ కొన్ని తమిళ సినిమాలు చేశారు. మరి రాయన్ ప్రత్యేకత ఏమిటి..?
తమిళ్ లో నాకు నచ్చిన ఫిల్మ్ మేకర్స్ తో పని చేశాను. ధనుష్ అన్నతో కెప్టెన్ మిల్లర్, ఇప్పుడు రాయన్ సినిమాలు చేశాను. ఇందులో నాకు దక్కిన క్యారెక్టర్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఇది నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ గా నిలిస్తుంది.
రాయన్ లో మీ పాత్ర ఏమిటి?
అది స్క్రీన్ పైనే చూడాలి. నా క్యారెక్టర్ కి ఉన్న వెయిటేజీ గురించి చెప్పాలంటే.. ధనుష్ అన్న తన కోసం రాసుకున్న క్యారెక్టర్ ని నాకు ఇచ్చారు. ఇప్పటివరకు నేను చేయని క్యారెక్టర్. ఎమోషనల్ యాంగిల్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. యాక్షన్ కూడా ఉంటుంది. చాలా ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నాను.
ట్రైలర్ చూస్తే ఇదొక ఫ్యామిలీ నేపథ్యంలో సాగే కథలా ఉంది..?
కథ గురించి ఇప్పుడు ఏ మాత్రం చెప్పను. ధనుష్ పెద్దన్న, నేను రెండో వాడిని, మూడో వాడు కాళిదాస్, ఒక చెల్లి. ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించి కథ. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా ఉంటుంది.
ధనుష్ డైరెక్షన్ లో యాక్ట్ చేయడం ఎలా ఫీలయ్యారు?
చాలా టఫ్ ఫిల్మ్ ఇది. తొంబై రోజులు షూటింగ్ లో నేను 75 రోజులు చేశా. నాకొక టఫ్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్. యాక్షన్ సీన్ లో షోల్డర్ ఇంజురీ కూడా అయ్యింది. గ్రీజ్ పూసుకుని సెట్ కి వెళ్ళేవాడిని. ధనుష్ అన్న కూడా డైరెక్టర్ గా వెరీ టఫ్. కృష్ణవంశీ, దేవాకట్టా, రాజ్ డీకే లతో ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఫీలయ్యాను రాయన్ కూడా అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
రాయన్ టైటిల్ పెట్టడానికి కారణం?
ఇందులో మా ఇంటి పేరు రాయన్. ఇది నార్త్ మద్రాస్ లో జరిగే ఆథెంటిక్ స్టొరీ. నార్త్ మద్రాస్ లో జరిగిన కథని తెలుగు డబ్బింగ్ లో చూడటమే బావుంటుందని అన్నారు. కేజీఎఫ్, తిరు సినిమాలు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో రాయన్ ని కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు.
పీటర్ హెయిన్స్ మాస్టర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
ఈ సినిమాలో ఫైట్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. ప్రతి ఫైట్ కి ఒక స్టోరీ ఉంటుంది. పీటర్ మాస్టర్ అద్భుతంగా కంపోజ్ చేశారు.
సన్ పిక్చర్స్ మేకర్స్ గురించి ?
సన్ పిక్చర్స్ గ్రేట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్. వారితో కలిసి పని చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్.
ధనుష్ గారి సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేయాలని అనుకుంటారు?
పుదుపేట్టై. రఘువరన్ బీటెక్ సినిమాలను రిమేక్ చేయడానికి ప్రయత్నించాం.. కానీ చివరి నిమిషంలో కుదరలేదు.
భైరవకోన కు సీక్వెల్ ఉంటుందా?
భైరవకోన కు వచ్చిన రెస్పాన్స్, సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సీక్వెల్ తప్పకుండా చేస్తాం.
మీ కొత్త సినిమాల గురించి చెప్పండి?
నక్కిన త్రినాధరావు గారితో ఒక సినిమా జరుగుతోంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే మయావన్ సినిమా కూడా జరుగుతోంది. ఇది సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో టైపు సినిమా. అలాగే రాహుల్, స్వరూప్ తో వైబ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది.