టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి ఓ కొత్త అప్డే్ట్ వచ్చింది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ని వైజాగ్‌లో షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా షూట్ చేయనున్నారు.
సందీప్ కిషన్‌ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.