లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్స్ గా అలాగే రావు రమేష్ మరియు అన్షు సాగర్ మరో లీడ్ పాత్రల్లో దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం “మజాకా” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం ఆడియెన్స్ కి ఒక ఓకే ఎంటర్టైనింగ్ ట్రీట్ ని అయితే థియేటర్స్ లో ఇచ్చింది.
ఇక ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఓటిటిలో సందడి చేసేందుకు ఈ చిత్రం వచ్చేయబోతుంది. ఈ సినిమా ఓటిటి హక్కులు జీ5 సంస్థ సొంతం చేసుకోగా అందులో ఈ మార్చ్ 28 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా ఇపుడు ప్రకటించారు. సో ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యి ఇపుడు చూడాలి అనుకునేవారు చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా ఈ చిత్రాన్ని రాజేష్ దందా నిర్మాణం వహించారు.