క్లీన్ ‘యూ’ తెచ్చుకున్న సందీప్ స్పోర్ట్స్ డ్రామా.!

క్లీన్ ‘యూ’ తెచ్చుకున్న సందీప్ స్పోర్ట్స్ డ్రామా.!

Published on Mar 2, 2021 11:00 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకడు. ఇప్పటికే ఎన్నో చిత్రాలు చేసిన సందీప్ ఈ మధ్యనే మళ్ళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే ఈ ట్రాక్ ను అలాగే కొనసాగించడానికి మరో చిత్రంతో రెడీ అయ్యాడు అదే “ఏ 1 ఎక్స్ ప్రెస్”. తన కెరీర్ కు ఎక్స్ ప్రెస్ అనేది ఎంత మైలేజ్ ఇచ్చిందో తెలిసిందే. అందుకే ఆ సెంటిమెంట్ ను ఇంకా కొనసాగితున్నాడు.

మరి దానిని పక్కన పెడితే ఈ సినిమాకు మాత్రం మంచి బజ్ నెలకొంది. తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా లేటెస్ట్ గా సెన్సార్ ను పూర్తి చేసుకున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు గాను సెన్సార్ వారు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇటీవలే వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ మార్చ్ 5 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా డెనీస్ జీవన్ దర్శకత్వం వహించారు. అలాగే హిప్ హాఫ్ తమీజా సంగీతం ఇచ్చిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు