సంక్రాంతికి రాబోతున్న ‘మాజాకా’ !

యంగ్ హీరో సందీప్ కిష‌న్ – దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రానికి టైటిల్ ఖారరు చేశారు. ఈ మాస్ ఎంటర్టైనర్ కి ‘మాజాకా’ అనే పేరు ఖ‌రారు చేశారు. టైటిల్ రివీల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుద‌ల చేశారు. సందీప్ కిషన్ పెళ్లి కొడుకు గెట‌ప్ లో కనిపించగా.. అతని చుట్టూ పెళ్లి హ‌డావుడి కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సందీప్ కిషన్ ఆకట్టుకున్నాడు.

కాగా ధ‌మాకా త‌ర‌వాత న‌క్కిన త్రినాథ‌రావు నుంచి వ‌స్తున్న సినిమా కావడంతో ఈ మజాకా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాత‌. రాజేష్ దండా నుంచి వ‌చ్చిన ‘సామ‌జ‌వర‌గ‌మ‌న‌’ మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే మజాకా కూడా మంచి విజయాన్ని సాధిస్తోందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రావు ర‌మేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘మ‌న్మ‌థుడు’ ఫేమ్ అన్షు.. రావు ర‌మేష్ కి జోడీగా న‌టిస్తుంది.

కాగా ఈ సినిమా 2025 సంక్రాంతికి థియేటర్లలోకి రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకి రచయిత.

Exit mobile version