“మ్యాడ్ స్క్వేర్”లో హైలైట్ గా సునీల్ పై ఊహించని విధంగా!

“మ్యాడ్ స్క్వేర్”లో హైలైట్ గా సునీల్ పై ఊహించని విధంగా!

Published on Mar 27, 2025 11:10 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉగాది కానుకగా రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో యంగ్ హీరోస్ నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం మ్యాడ్ స్క్వేర్ కూడా ఒకటి. మరి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో నటుడు సునీల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన రోల్ ఈ సినిమాలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది అని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. అలాగే సునీల్ నుంచి మంచి డార్క్ కామెడీ ఈ చిత్రంలో ఉంటుందని ప్రామిస్ చేస్తున్నారు. ఇలా మ్యాడ్ స్క్వేర్ లో మాత్రం సునీల్ హైలైట్ గా ఉంటారని తన మాటలతో అర్ధం చేసుకోవచ్చు. ఇక భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం రేపు మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు