హాట్ టాపిక్ అవుతున్న సునీల్ రెమ్యూనరేషన్ !

హాట్ టాపిక్ అవుతున్న సునీల్ రెమ్యూనరేషన్ !

Published on Aug 25, 2018 11:48 AM IST

కమిడియన్ గా కెరీర్ పీక్ స్టేజి లో వున్నపుడు హీరో గా టర్న్ తీసుకొని నటించిన చిత్రాలు సునీల్ ను స్టార్ హీరో గా నిలబెట్టలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఆయన మళ్లీ కమిడియన్ రూట్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. దాంట్లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ, అరవింద సమేత’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు ‘సిల్లీ ఫెలోస్’ లాంటి తక్కువ బడ్జెట్ చిత్రాలు వున్నాయి.

ఇక ఈ చిత్రాలకు కమిడియన్ గా చేస్తునందుకు సునీల్ రోజుకు 3. 5 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడున్న తెలుగు కమిడియన్స్ లో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుడు సునీలే కావడం విశేషం. ఇక ఈ చిత్రాలతో ఆయన మళ్లీ కమిడియన్ గా బిజీ కావడం ఖాయం గా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు