ఇక్కడ సునీల్.. అక్కడ బాబీ సింహ..?

ఇక్కడ సునీల్.. అక్కడ బాబీ సింహ..?

Published on Jan 12, 2015 8:44 PM IST

sunil
మలయాళంలో ఘనవిజయం సాదించిన ‘బెంగళూరు డేస్’ సినిమాను తెలుగు, తమిళ భాషలలో పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పోట్లురి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్దార్ద్, సమంత, తమిళ హీరో ఆర్య, నిత్యా మీనన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన హీరో సునీల్ ను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారట. ఇదే పాత్రను తమిళంలో ‘జిగర్తాండ’ ఫేం బాబీ సింహాకు ఆఫర్ చేశారట. వీరు ఓకే చెప్పారో..? లేదో..? తెలియదు. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ రీమేక్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. మార్చ్ 1వ తేదీ నుండి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు