బ‌జ్: స‌న్నీ డియోల్ – గోపీచంద్ సినిమాకు టైటిల్ ఇదేనా..?

బ‌జ్: స‌న్నీ డియోల్ – గోపీచంద్ సినిమాకు టైటిల్ ఇదేనా..?

Published on Jun 30, 2024 3:00 AM IST

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని త‌న నెక్ట్స్ మూవీని బాలీవుడ్ హీరో స‌న్నీ డియోల్ తో చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో రెగ్యుల‌ర్ షూట్ కూడా స్టార్ట్ చేశారు మేక‌ర్స్. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం తెలుగు ఆడియెన్స్ తో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విష‌యంలో ఓ వార్త సినీ సిర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాను పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్. ఇక ఈ సినిమాకు ‘జ‌ట్’ అనే టైటిల్ ను పెట్టేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ టైటిల్ నార్త్ తో పాటు సౌత్ ఆడియెన్స్ ని కూడా ఆక‌ట్టుకుంటుంద‌ని వారు భావిస్తున్నారు.

ఈ సినిమాలో స‌న్నీ డియోల్ ఓ సరికొత్త లుక్ లో క‌నిపిస్తాడు. ఇక ఈ సినిమాలో రెజినా క్యాసాండ్ర, స‌యామీ ఖేర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. థ‌మన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండ‌గా, మైత్రీ మూవీ మేక‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు