గోపీచంద్ సినిమాకి సన్నీ డియోల్ లుక్ వైరల్.!


రీసెంట్ గా అనౌన్స్ అయ్యిన పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా చేస్తున్న క్రేజీ కాంబినేషన్ సినిమా కూడా ఒకటి. మరి చిత్రంతో సన్నీ డియోల్ టాలీవుడ్ ఆడియెన్స్ కి గోపీచంద్ బాలీవుడ్ ఆడియెన్స్ కి మరింత దగ్గర కానుండగా ఈ మాస్ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే షూట్ అప్డేట్స్ కూడా మేకర్స్ రెగ్యులర్ గా అందించడం స్టార్ట్ చేయగా ఈ సినిమాకి గాను సన్నీ డియోల్ ప్రిపేర్ చేసిన లుక్ ఇపుడు వైరల్ గా మారింది. మరి లేటెస్ట్ గా సన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ని షేర్ చేసుకోగా మంచి స్టైలిష్ అండ్ రిఫ్రెషింగ్ లుక్ లో తాను కనిపిస్తున్నాడు అని చెప్పాలి. ట్రిమ్డ్ గడ్డం కోర మీసంతో పవర్ ఫుల్ లుక్ ని ఈ సినిమాకి ప్రిపేర్ చేసినట్టు ఉన్నారని చెప్పాలి. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version