కాంట్రవర్సీలో ‘జాట్’.. ఆ సీన్ పై అభ్యంతరం

కాంట్రవర్సీలో ‘జాట్’.. ఆ సీన్ పై అభ్యంతరం

Published on Apr 16, 2025 12:57 PM IST

బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో చేసిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘జాట్’. ఒక పవర్ ప్యాకెడ్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది. అయితే స్టడీగా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఓ కాంట్రవర్సీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఓ సన్నివేశం పట్ల క్రైస్తవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సినిమా విలన్ నటుడు రణదీప్ హుడా ఓ సన్నివేశంలో చర్చిలో యేసు శిలువ ముందు తాను కూడా ఆ తరహాలోనే పోజ్ పెట్టి నిలబడి కనిపించడం అలాగే ప్రార్ధనలు జరిగిన చోటే హింసాత్మక సంఘటనలు లాంటివి చర్చి తాలూకా పవిత్రతను దెబ్బ తీశాయి అని దీనితో తమ మనోభావాలు దెబ్బ తిన్నట్టుగా నార్త్ లో పలువురు క్రైస్తవ సంఘాలు జాట్ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యాలని అంటున్నారు. అలాగే సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గరికి వెళ్లి కూడా ప్రదర్శనలు ఆపుతామని కూడా అంటున్నారట. దీనితో క్లీన్ గా వెళ్ళిపోతుంది అనుకున్న జాట్ చిత్ర యూనిట్ కి ఈ ట్విస్ట్ ఎదురైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు