స్ట్రాంగ్ హోల్డ్ తో ‘జాట్’.. మొదటి సోమవారం సాలిడ్ వసూళ్లు!

స్ట్రాంగ్ హోల్డ్ తో ‘జాట్’.. మొదటి సోమవారం సాలిడ్ వసూళ్లు!

Published on Apr 15, 2025 1:58 PM IST

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రం “జాట్”. స్టార్ నటుడు సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అయితే అవ్వడానికి తక్కువ ఓపెనింగ్స్ నే వచ్చినప్పటికీ జాట్ ఇంట్రెస్టింగ్ గా స్ట్రాంగ్ హోల్డ్ ని వరల్డ్ వైడ్ కొనసాగిస్తుండడం విశేషం.

ఇలా మొదటి నాలుగు రోజులతో సాలిడ్ వీకెండ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిన్న సోమవారం వర్కింగ్ డే కూడా మంచి వసూళ్లు ఈ చిత్రం అందుకోవడం విశేషం. ఇలా నిన్న సోమవారం ఒక్క రోజే ఇండియా వైడ్ గా 7 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకొని ఈ చిత్రం 48 కోట్ల దగ్గర మార్క్ కి చేరుకుంది. అలాగే వరల్డ్ వైడ్ 58.2 కోట్ల వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఇలా మొత్తానికి మాత్రం జాట్ నెమ్మదిగానే మొదలైనా స్ట్రాంగ్ హోల్డ్ లో కొనసాగుతుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు