బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేసిన ఈ మొదటి సినిమా థియేటర్స్ లో సన్నీ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ని అందిస్తుంది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఒకింత తక్కువ ఓపెనింగ్స్ నే అందుకున్నప్పటికీ వీకెండ్ కి మాత్రం క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ వెళ్ళింది అని చెప్పాలి.
ఇలా మొత్తం శనివారంకి ఆదివారంకి 4 కోట్లకి పైగా నెట్ వసూళ్లు ఎక్కువ సాధించి ఇండియా వైడ్ గా 40 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ అయితే మొత్తం 49.3 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇలా మొత్తానికి జాట్ ఒక సాలిడ్ వీకెండ్ ని అందుకుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా రణదీప్ హూడా విలన్ రోల్ లో నటించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రం తోనే బాలీవుడ్ లో ఎంటర్ అయ్యిన సంగతి తెలిసిందే.