టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘జాట్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.
‘జాట్’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మంగళూరులో జరుగుతుందని.. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారని.. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తున్నారని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు సెట్స్ నుంచి ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ సినిమాలో గోపీచంద్ మలినేని నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రణ్‌దీప్ హూడ, వినీత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్ర, సయామీ ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.