సూపర్ క్లిక్స్ : దీపావళి స్పెషల్ కాస్ట్యూమ్స్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్, లావణ్య

సూపర్ క్లిక్స్ : దీపావళి స్పెషల్ కాస్ట్యూమ్స్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్, లావణ్య

Published on Nov 14, 2023 3:03 AM IST


నూతన వధూవరులు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల నటి లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీ లో ఎంతో వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీ ద్వారా చిగురించిన వీరి ప్రేమ, ఆ తరువాత ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి శుభప్రదమైన వివాహబంధం గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ తొలి పండుగైన దీపావళి ని వైభంగా జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా వరుణ్, లావణ్య ఇద్దరూ కూడా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో దిగిన స్పెషల్ ఫోటో షూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా వీరిద్దరి దాంపత్యం కలకాలం ప్రేమానురాగాలతో ఎంతో అన్యోన్యంగా కొనసాగాలని మా 123 తెలుగు తరపున ప్రత్యేకంగా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు