బుల్లితెర పై బలగం కి మరోసారి సాలిడ్ రెస్పాన్స్!


టాలీవుడ్ లో మంచి కంటెంట్ తో సినిమా వస్తే ఆడియెన్స్ ఆదరిస్తారు అని మరోసారి రుజువు చేసిన చిన్న చిత్రం బలగం. చిత్రం చిన్నదే అయినా, దాని ప్రభావం ఈ ఏడాది గట్టిగానే ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుది కాదు. బుల్లితెర పై కూడా అదే తీరుని కనబరుస్తోంది ఈ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్.

ప్రముఖ నటుడు, కమెడీయన్ వేణు డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఈ చిత్రం లాస్ట్ వీక్ బుల్లితెర పై మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం 7.71 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇంకెలంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version