యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్సేన్ ఇటీవల దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టికెట్ విండోస్ వద్ద మంచి బిజినెస్ చేసింది. రావిషింగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. థియేట్రికల్ రన్ తర్వాత, ఈ చిత్రం ఆహాలో రెండు రోజుల క్రితం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దాస్ కా ధమ్కి ఇప్పుడు ఆహా వీడియో లో 48 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమాకి ఇదే తరహా వ్యూస్ ఉండే అవకాశం ఉంది. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో విశ్వక్సేన్ ద్విపాత్రాభినయం చేశాడు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. భవిష్యత్తులో దాస్ కా ధమ్కీ సీక్వెల్ రాబోతుంది.