“ఫర్జి” సీరిస్ కు అద్దిరిపొయే రెస్పాన్స్!


ఓటిటి లు అలవాటైనప్పటి నుండి ఇండియా లో సినిమాలకి సమానం గా వెబ్ సిరీస్ లు ప్రత్యేకత ను సొంతం చేసుకున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి వచ్చిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ కు విశేష ఆదరణ లభిస్తోంది. కేవలం హిందీ లో మాత్రమే కాకుండా, సౌత్ లోని ప్రధాన భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

ఈ సిరీస్ కి ఓపెనింగ్ సూపర్ గా వచ్చినట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించడం జరిగింది. ఒక ఆర్టిస్ట్ నకిలీ కరెన్సీ ను తయారు చేసే కథ గా తెరకెక్కిన ఈ హై ఇంటెన్స్ డ్రామా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి లతో పాటుగా, రాశి ఖన్నా, రెజీనా కాసాండ్రా లు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్ అండ్ డీకే లు రూపొందించిన ఈ సిరీస్ రెండవ సీజన్ పై సైతం ఆసక్తి నెలకొంది.

Exit mobile version