ఆహాలో “హరోం హర” కి సాలిడ్ రెస్పాన్స్!

ఆహాలో “హరోం హర” కి సాలిడ్ రెస్పాన్స్!

Published on Jul 22, 2024 8:30 PM IST

టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు చివరిసారిగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరోం హర చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటించడం జరిగింది. ఈ చిత్రం ఆహా వీడియో, ఈటీవీ విన్‌, ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ చిత్రం ఓటిటి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఆహా వీడియోలో 75 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు పోతుంది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

థియేటర్లలో ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఓటిటి లో వస్తున్న రెస్పాన్స్ పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు