టాప్ లో ట్రెండ్ అవుతోన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్!


పులి మేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో గత శుక్రవారం వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరియు హీరో ఆది సాయి కుమార్‌ల ఓటిటి అరంగేట్రం. టాలీవుడ్ ప్రముఖ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ పులి మేకకు క్రియేటర్ మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజా అప్డేట్ ఏమిటంటే, ఈ తెలుగు షో జీ5 ఇండియా చార్ట్‌లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

అతి తక్కువ సమయంలోనే షోకి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ షోలో బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్, సుమన్, రాజా చెంబోలు, గోపరాజు రమణ, ముక్కు అవినాష్, నోయెల్ సీన్, స్పందన పల్లి, సాయి శ్రీనివాస్ ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్‌తో పంతం చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రవర్తి రెడ్డి ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.

Exit mobile version