తేజ సజ్జ “హనుమాన్” టీజర్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

తేజ సజ్జ “హనుమాన్” టీజర్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

Published on Dec 5, 2022 4:35 PM IST


తేజ సజ్జ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ను పాన్ ఇండియా మూవీ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ టీజర్ ఇప్పటి వరకూ 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 1 మిలియన్ కి పైగా లైక్స్ ను సాధించింది. టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు