విక్రమ్ “కోబ్రా” తెలుగు టీజర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్!

విక్రమ్ “కోబ్రా” తెలుగు టీజర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్!

Published on Aug 24, 2022 9:53 PM IST


చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్ట్ 31, 2022 న విడుదల కానుంది. నిన్న ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. 24 గంటల్లో ఈ టీజర్ 175కే కి పైగా లైక్స్‌తో పాటు 3.5 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఒక తమిళ నటుడికి ఇది నిజంగా పెద్దది అని చెప్పాలి.

ప్రస్తుతం దక్షిణాది నగరాల్లో సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న టీమ్, ఆగస్ట్ 28, 2022 న హైదరాబాద్‌కు రానుంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. రేపు థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోబ్రా సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మృణాళిని రవి, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, కెఎస్ రవి కుమార్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు