‘గాడ్ ఫాదర్’ ‘థార్ మార్ ఠక్కర్ మార్’ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్

Published on Sep 22, 2022 7:58 pm IST

మెగాస్టార్ చిరంజీవితో మోహన్ రాజా ప్రస్తుతం తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ మూవీ పై ఆడియన్స్ లో మంచి ఆసక్తిని ఏర్పరిచాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక రోల్ చేస్తుండగా ఇతర ప్రధాన పాత్రల్లో నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సునీల్ తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ మూవీ నుండి నిన్న థార్ మార్ ఠక్కర్ మార్ అనే పల్లవితో సాగే మాస్ బీట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసింది యూనిట్. థమన్ అందించిన బ్యూటిఫుల్ ట్యూన్ కి శ్రేయాఘోషాల్ అందించిన అద్భుత గాత్రం, అలానే మెగాస్టార్, సల్మాన్ ల సిగ్నేచర్ స్టెప్స్ ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని దూసుకెళుతోంది. మెగాఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఈ మూవీ పై రోజురోజు కి మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. మరి రిలీజ్ తరువాత గాడ్ ఫాదర్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :