వైరల్: కూతురు సితార తో సూపర్ స్టార్ స్టైలిష్ లుక్!

వైరల్: కూతురు సితార తో సూపర్ స్టార్ స్టైలిష్ లుక్!

Published on Sep 1, 2024 2:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిసారిగా గుంటూరు కారం చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తదుపరి దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. మహేష్ బాబు ఈ చిత్రంకోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశాడు. కూతురు సితార ఘట్టమనేని తో ఉన్న ఫోటో అది. అందులో మహేష్ బాబు గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో ఉన్నాడు. న్యూయార్క్ నగర వీధుల్లో ఉన్నట్లుగా ఫోజులిచ్చిన ఈ ఫోటో సోషల్ మీడియాలో కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది. నమ్రతా శిరోద్కర్ కూడా కూతురు సితార తో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు