అద్దిరిపోయిన సూపర్ స్టార్ మహేష్ ట్రెండీ లుక్!

అద్దిరిపోయిన సూపర్ స్టార్ మహేష్ ట్రెండీ లుక్!

Published on Jul 12, 2024 11:00 PM IST

అనంత అంబానీ మరియు రాధిక ల వెడ్డింగ్ కి దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వేడుకలో సౌత్ ఇండియా నుండి కూడా పలువురు హాజరు అయ్యారు. అయితే ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు సూపర్ స్టార్ మహేష్ బాబు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో, ట్రెండీ డ్రెస్ లో ఆకట్టుకుంటున్నారు. ఈ వెడ్డింగ్ కి మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ మరియు కూతురు సితార లు కూడా హాజరు అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహేష్ బాబు లుక్ కి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం యాక్షన్ ఎంటర్టైనర్ లో చివరిసారిగా కనిపించారు మహేష్ బాబు. తదుపరి దర్శక దిగ్గజం, మాస్టర్ స్టోరీ టెల్లర్ అయిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమా ప్రారంభం గురించి మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు