టాక్.. “దేవర” ప్రీరిలీజ్ కోసం ‘సూపర్’ ప్లానింగ్?

టాక్.. “దేవర” ప్రీరిలీజ్ కోసం ‘సూపర్’ ప్లానింగ్?

Published on Sep 8, 2024 5:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా “దేవర” కూడా ఒకటి. స్టార్ అవ్వడం లేటెస్ట్ గానే స్టార్ట్ అయినా ఈ సినిమా కంటే ముందే మొదలైన సినిమాల కంటే ముందే రిలీజ్ కి ఈ చిత్రం వచ్చేస్తుంది.

మరి మాస్ లో సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుండగా ఇప్పుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ కి “సూపర్” ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అదేమిటంటే ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా రాబోతునట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు