50 ఏళ్లు పూర్తి చేసుకున్న యాక్షన్ కింగ్ బాలయ్య కి అభినందనలు – రజినీకాంత్

50 ఏళ్లు పూర్తి చేసుకున్న యాక్షన్ కింగ్ బాలయ్య కి అభినందనలు – రజినీకాంత్

Published on Sep 1, 2024 1:12 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరో అయిన నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ప్రేక్షకులని, అభిమానులని అలరిస్తూనే ఉన్నాడు. చివరిసారిగా భగవంత్ కేసరి చిత్రంలో కనిపించిన బాలయ్య, తదుపరి దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 లో కనిపించనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్యకు అభిమానులు, సినీ పరిశ్రమకి సంబందించిన పలువురు ప్రముఖులు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బాలయ్యకి అభినందనలు తెలిపారు. యాక్షన్ కింగ్, కలెక్షన్ కింగ్, డైలాగ్ డెలివరీ కింగ్, నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా బలంగా కొనసాగుతున్నారు. ఒక గొప్ప విజయం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు మరియు అతనికి మంచి ఆరోగ్యం మరియు జీవితాంతం ఆనందాన్ని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ అని పేర్కొన్నాడు. రజినీకాంత్ చేసిన ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు