మహేష్ బాబు ఇండియాకి తిరిగివచ్చేది అప్పుడేనట …?

మహేష్ బాబు ఇండియాకి తిరిగివచ్చేది అప్పుడేనట …?

Published on Oct 17, 2022 6:48 PM IST

mahesh 3

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని ఎంతో భారీగా నిర్మిస్తోంది.

అయితే విషయం ఏమిటంటే, కొద్దిరోజుల క్రితం వ్యక్తిగత కారణాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్టోబర్ 24న ఇండియాకి తిరిగి వస్తారని, ఆ తరువాత కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న అనంతరం నవంబర్ 4 నుండి తిరిగి SSMB28 మూవీ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

మొత్తంగా సూపర్ స్టార్ తో సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న మూవీ కావడంతో దీని పై సూపర్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు యావత్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు