సూపర్ స్టార్ మహేష్ బాబు ,ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏ ఎమ్ బి సినిమాస్ పేరుతో మల్టీ ఫ్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ అధునాతమైన థియేటర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో అందుబాటులోకి రానుంది.
దాంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మల్టి ఫ్లెక్స్ థియేటర్లను నిర్మించనున్నారని సమాచారం. సాంకేతిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్లలో అత్యంత సౌకర్యవంతగా సినిమా చూసే అవకాశం వుంటుందట.
ఇక మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.